పద్మావతి బంగారయ్య గారి అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఊరుకొండ మండల ఎంపీపీ రాధా జంగయ్య

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి బంగారయ్య గారి అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఊరుకొండ మండల ఎంపీపీ రాధా జంగయ్య మరియు జడ్పీటీసీ శాంతకుమారి రవీందర్ గార్లు పాల్గొని సమావేశంలో మాట్లాడుతూ మాది నూతన మండలం కాబట్టి పలు శాఖలకు సంబంధిత కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా అదేవిధంగా కస్తూర్బా కళాశాల భవనం సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నందున భవన నిర్మాణం గురించి కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. మండలంలోని పలు తండాలకు వీటి రోడ్లు నిర్మించాలని కోరడం జరిగింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలలో పనులు త్వరితగతిన పూర్తి చేసినందుకు కృషి చేయాలని కోరడం జరిగింది. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రాధా జంగయ్య గారు చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.