దేవాలయాల్లో భక్తుల సందడి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిదిలోని ఊరుకొండపేట గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవలయంకి తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం భక్తులతో సందడి నెలకొన్నది. ఉదయం ఊరుకొండపేట అర్చకుల ఇంటినుండి స్వామి వారి ములవిరట్ ను పల్లకిసేవలో పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో భజన పాటలతో ఉరేగిస్తూ గ్రామ ప్రజలు అందరు కలిసి దేవాలయం కి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ గ్రామాలనుండి విచ్చేసిన భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారుడిగా ప్రసిద్ధిగాంచిన స్వామివారిని దర్శించుకున్నారు.. భక్తులతో దేవాలయం జైశ్రీరాం-జైహనుమన్ నినాదాలతో మారుమోగాయి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈశ్వరమ్మ,ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు,మాజీ చైర్మన్ నర్సిరెడ్డి,.గ్రామ వార్డు సభ్యులు శ్రీనివాస్, నాయకులు నాగోజి,అశోక్ రెడ్డి రామాంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, కృష్ణ,యాదయ్య, శ్రీశైలం మల్లయ్య, బాలయ్య,బీఎంసీ ఛైర్మెన్ రవిసాగర్ నాయకులు గ్రామ ప్రజలు భక్తులు అర్చకులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.