దళితుల అభ్యున్నతికి కోసం కృషి చేసి నాయకుడు కేసీఆర్ గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి

గద్వాల నియోజకవర్గం లో ధరూర్ మండలం పరిధిలోని ర్యాలంపాడు గ్రామానికి చెందిన రంగన్న కి దళిత బంధు లబ్ధిదారులకు ఎంపికైన అయినా ను 10 లక్షల వ్యయంతో దినాకర్ టెంట్ హౌస్ సప్లయర్ షాప్ మంజూరు కావడం జరిగింది యూనిట్ ని గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. ఎమ్మెల్యే గారికి లబ్ధిదారులు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు దళితుల కోసం దళిత బంధం ప్రవేశపెట్టడం జరిగినది.దళితులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే గత ప్రభుత్వాలు ఉపయోగించుకున్నారు వారికి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి లేదు వారి అభివృద్ధి కొరకు ఎలాంటి కృషి చేయలేదు అన్నారు . ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రి కి రాని ఆలోచనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి రావడం జరిగింది దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితులు గతంలో ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి నాయకుడు సీఎం కేసీఆర్ గారు పేర్కొన్నారు.దళిత బంధు మొదటి విడతగా నియోజకవర్గానికి 100 యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరికొన్ని యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు.దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ గారు అని అన్నారు.దళిత బంధు ద్వారా ప్రతి ఒక్క దళిత బిడ్డ అభివృద్ధి చెందాలని ఆర్థికంగా ఎదగాలని అన్నది ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ లు నజూమన్నీసా బేగం, విజయ్, జెడ్పీటీసీలు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు,మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు రఘవర్థన్ రెడ్డి, సర్పంచ్ కర్రెమ్మ, గద్వాల మండలం పార్టీ అధ్యక్షుడు రాముడు, తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, జంబు రామన్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, శ్రీరాములు,కురుమన్న భగీరథ వంశీ, మన్యం , మండలం యూత్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.