తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య మీడియా సమావేశం

తిరువూరు టౌన్ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య మీడియా సమావేశంలో కామెంట్స్.అయ్యా సీఎం జగన్ రెడ్డి పదో తరగతి విద్యార్థుల రీవాల్యుయేషన్ కి డబ్బులు కట్టించుకుని వాటి ఫలితం విడుదల చేయకుండా ఇప్పుడు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది ఎంత వరకు సబబు..విద్యార్థుల జీవితాలతో ఆట ఆడటం కాకుండా వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానా నింపుకుంటున్నారు ఇలా చేయటం దౌర్భాగ్య చర్య..జగనన్న విద్యా కానుక అమ్మ ఒడి ఎంతమంది ఇస్తున్నారు. తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు..ఏ కొండూరు మండలంలో 4451 మందికి మీరు ఇచ్చే విద్యా కానుక సుమారుగా 350 మందికి మాత్రమే..విస్సన్నపేట మండలంలో 5523 మందికి సుమారుగా 400 మందికి మాత్రమే జగనన్న విద్యా కానుక అందిస్తున్నారు..తిరువూరు మండలంలో 5948 కి గాను 400 మందికి మాత్రమే అందిస్తున్నారు..గంపలగూడెం మండలంలో 6547 కి మీరు ఇస్తున్న జగనన్న విద్యా కానుక 400 మందికి మాత్రమే.తిరువూరు నియోజకవర్గంలో 22,469 మందికి మీరు ఇస్తున్న జగనన్న విద్యా కానుక సుమారుగా 1600 మంది విద్యార్థులకు మాత్రమే మీరు అందిస్తున్నారు..అమ్మ ఒడి కింద 15వేలు రూపాయల చొప్పున పేద విద్యార్థులకు ఇస్తానని చెప్పి మాట మరచి మొదటి సంవత్సరం 14 వేల రూపాయలు మాత్రమే ఇచ్చావుపాఠశాల అభివృద్ధి పేరుతో ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 1000 రూపాయలు వసూలు చేసి నీ ఖజానా ను నింపుకున్నావు..ఇప్పుడు ఇంకో 1000 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు పంపిణీ చేశావు.తిరువూరు నియోజవర్గ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం..జగనన్న విద్యా కానుక పేరుతో నాసిరకమైన వస్తువులను పంపిణీ చేశారు.1,2,3వ తరగుతుల విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాలకు పరిమితం చేయాలని జీవో తీసుకొచ్చారుసమీపంలో ఉన్న పాఠశాలలను మూసివేసి వేరే పాఠశాల లో విలీనం చేయటం చాలా దౌర్భాగ్య చర్యఈ విధంగా చేయడం వల్ల పేద ప్రజలైన ఎస్సీ ఎస్టీ బిసీలకు చాలా ఇబ్బందికరం.వెంటనే ఈ జీవోను రద్దు చేయాలి.ఈ కార్యక్రమంలో లావు భగత్… బోయపాటి రామకృష్ణ… కొమ్మినేని నాని ..జినుగు అశోక్… తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.