తుడుందెబ్బ బంద్ పిలుపుకు సిపిఐ-ఎంఎల్ (ప్రజాపంథా) సంపూర్ణ మద్దతు

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:09-07-2022; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సిపిఐ-ఎంఎల్ (ప్రజాపంథా) కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి జగన్ సింగ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొయపొశగూడెం ఆదివాసులపై ఫారెస్ట్ అదికారుల ధమనకాండను సిపిఐ-ఎంఎల్ (ప్రజాపంథా) తరపున తీవ్రంగా ఖండించారు. అటవీశాఖ అదికారుల దాడికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అధ్వర్యంలో మరొదశ అటవీ పోరాటానికి శ్రీకారం చుడతామన్నారు. జూన్ నెలలో కొయపొశగుడెం నుంచి ITDA కార్యాలయం ఉట్నూరు వరకు ఆదివాసులు పాదయత్రగా వచ్చి PO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11వ తేదీన తుడుందెబ్బ తలపెట్టిన బందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సుభాష్, రాజు, శంకర్, వినోద్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.