డి ఈ ఓ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి -యుటిఎఫ్

ప్యాపిలి జూలై 06 (ప్రజా నేత్ర న్యూస్) :ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జిఓ నంబరు 117 మార్గదర్శకాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జూలై 8 వ తేదీన చేపడుతున్న ఉమ్మడి జిల్లా డి ఈ ఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుటిఎఫ్ నంద్యాల జిల్లా ఆర్థిక కార్యదర్శి నరసింహారెడ్డి,మండల శాఖ గౌరవాధ్యక్షులు లక్ష్మి నాయక్ పిలుపునిచ్చారు.స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిఓ 117 వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం కానున్నదని,ఎక్కువ సంఖ్యలో పోస్టులు సర్ప్లస్ కానున్నాయని కావున జూన్ 21 వ తేదీన విద్యా శాఖ మంత్రి గారితో ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపిన విధంగా సవరణలు చేయాలని కోరారు.చర్చల ఫలితంగా ఉపాధ్యాయ సంఘాలు కోరిన సవరణలు చేస్తామని మాట ఇచ్చిన అధికారులు సవరణలు చేయకుండా జీవోల మీద జీవోలు విడుదల చేస్తూ ఉపాధ్యాయులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.అదే విధంగా నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతుల విలీనం నిలిపివేయాలని కోరారు,ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ తరగతుల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.8 వ తరగతి వరకు కేవలం ఇంగ్లీష్ మీడియం లోనే బోధన చేయాలని చెప్తున్నారని కానీ ప్రాథమిక విద్య అనేది మాతృభాష లోనే ఉండాలని విద్యా హక్కు చట్టం చెప్తున్నదని తెలిపారు.కావున రెండు మీడియం ల ద్వారా సమాంతర బోధన జరగాలని కోరారు.వేసవి సెలవుల లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు నిర్వహిస్తామని తెలియ చేసిన ప్రభుత్వం దొడ్డిదారిన సిఫార్సు బదిలీలు నిర్వహించడం అన్యాయమని అన్నారు కావున వెంటనే బదిలీలు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల ఆర్థిక కార్యదర్శి మోహన్,శాంతి కుమార్,మోహన్ రావు,కళ్యాణి,షాహిదా భాను,సరస్వతి,శారద,నాగేశ్వర రెడ్డి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.