జోగులంబా గద్వాల్ జిల్లా అంబేద్కర్ ప్రజా వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండలం కేంద్రంలో గల అంబేద్కర్ ప్రజా వైద్యశాలను గద్వాల *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి * సందర్శించారు.ఆసుపత్రికి వచ్చే రోగుల రోజువారి వివరాలు, ఎలాంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు, సిబ్బంది వివరాలను డాక్టర్ ను ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన మండలంలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ప్రజా వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు జ్వరము, దగ్గు వంటి చిన్నచిన్న సమస్యలు వచ్చినప్పుడు గద్వాల వంటి దూర ప్రాంతాలకు రాకుండా స్థానికంగానే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.ఈ నెల 24న ఉచిత వైద్య శిబిరంతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రివర్యులు, కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, కావున ఆరోజు మండలంలోని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు హారీష్ రావు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లోనే పరిష్కరించి విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోరమ్మ, గట్టు మండలం ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, MRO, మండలం పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, మండలం యూత్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.