జూలై 31న ఆదివాసీ సేన అదిలాబాద్ జిల్లా కమిటీ ఎన్నికలు

అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ లో గల ఆదివాసీ సేన జిల్లా కార్యాలయంలో ఆదివాసీ సేన జిల్లా కమిటీ సమావేశం ఆదివాసీ సేన అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు పోరు కోరకు ఆదివాసీ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేల 31 తేదిన అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సేన నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ ఎన్నికల కార్యక్రమానికి ఆదివాసీ సేన అనుబంధ సంఘాలైన‌‌ ఆదివాసీ విద్యార్థి సేన, ఆదివాసీ మహిళ సేన, ఆదివాసీ రైతు సేన, ఆదివాసీ కార్మిక సేన, ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సంఘాల నాయకులు, డివిజన్ ఇంచార్జీలు, మండల,గ్రామ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, మరియు జిల్లాలోని రాయి సేంటర్ సార్మేడిలు అందరూ పాల్గొని ఆదివాసీ సేన అదిలాబాద్ జిల్లా కమిటీ ఎన్నికలను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు కుంరం కోటేశ్వర్, పేందోర్ విశ్వనాథ్, ఆదివాసీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్, జిల్లా కార్యదర్శి కాత్లె భుచ్చన్న, ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కుంరం దశరత్, ఆదివాసీ విద్యార్థి సేన జిల్లా నాయకులు కుంరం చత్రుఘన్, మడావి లాల్ షావ్, సలాం జాకు కాత్లే విఠల్ , జుగ్నాక్ శ్రీకాంత్,ఆత్రం గంగారాం,కుంరం ఉత్తం, రెడ్డి,పేందోర్ హన్మంతు,మరప పరమేశ్వర్, సోనేరావ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.