జిల్లాలో 15 పునరావాస కేంద్రాల ఏర్పాటు.కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జుల్లై 12 : జిల్లా లో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి జిల్లాలోని మహా ముత్తారం, కాటారం, భూపాలపల్లి, మహదేవ్పూర్ మండలాలలో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 800 మంది వరధ బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహ ముత్తారం మండలంలో 9 పునరవాస కేంద్రాలు, కాటారంలో 2, పునరావాస కేంద్రాలు, భూపాలపల్లి లో 3 పునరావాస కేంద్రాలు, మాదాపూర్ లో 1 ఏర్పాటు చేసి అధికారులు ఎప్పుడూ వారిని గమనిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అవసరం ఆయన టోల్ ఫ్రీ నెంబర్ 9 0 3 0 6 3 2 6 0 8 కు సమాచారం అందించి సహాయం పొందాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.