జిల్లాలోని దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూలై 29 ; జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ నందు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బందితో సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ ఈసీఐఎల్ హైదరాబాద్ వారిద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఉచిత పరికరాలు అందజేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దీనితోపాటుగా జిల్లాలోని విద్యార్థునుల కోసం సానిటరీ నాప్కిన్ మిషన్స్ ను ఎంపిక చేసిన పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు. ఈసీఐఎల్ బృందం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి జిల్లాలోని వివిధ పాఠశాలలను పరిశీలించి 21 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈసీఐఎల్ వారు 3000 మంది విద్యార్థినులకు సానిటరీ నాప్కిన్ అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని దివ్యాంగుల కొరకు మూడు రోజులపాటు క్యాంపులను నిర్వహించి సుమారు 1000 మంది దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకారణలను పంపిణీ చేస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని 14 ప్రభుత్వ హాస్పిటల్స్ నందు మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా సమకూర్చుతున్నట్లు ఈసీఐఎల్ వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈసీ ఐఎల్ నుండి సి. మునికృష్ణ ఏజీఎం సునీల్ కుమార్ పర్సనల్ ఆఫీసర్ విశ్వనాథరెడ్డి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డిడబ్ల్యూఓ శామ్యూల్ మ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.