జాతీయ నూతన విద్య విధానం 2020 రద్దు చేయాలి -AISF జాతీయ నాయకురాలు కామ్రేడ్ జ్యోతి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:13-07-2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకురాలు కామ్రేడ్ జ్యోతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్య విధానాన్ని ఏఐఎస్ఎఫ్ గా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ఈ నూతన విద్య విధానం వల్ల పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా ఉందని అన్నారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థుల మెదల్లో మత ఉన్మాదాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభమై దాదాపు నెల కావస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకలను, యునీపామ్స్ పంపిణీ చెయ్యకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం SDMC (స్కూల్ డెవలప్మెంట్ మానిటరి కమిటీ) చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఉద్యమానికి సిద్ధం ఉందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో AISF జిల్లా ప్రధాన కార్యదర్శి మేస్రం భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గేడాం కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.