ఘనంగా సీత్లా పండగ..

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం,
ఎక్లాస్ ఖాన్ పేట తాండలో సీత్ల పండుగను లంబాడి గిరిజనులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. తాండ వాసులందరు గ్రామ పొలిమేరలో వున్న అమ్మవారికి మొక్కులు చెల్లిచుకున్నారు. సీత్లా భవాని గిరిజనుల దేవత, గ్రామంలో పశువుల సంపద కోసం, పశువుల ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ తాండ వాసులు ఆయురారోగ్యాలతో సకల సంపదలు, సౌభాగ్యం కలిగి ఉండాలని పాడిపంటలతో సిరిసంపదలు కలగాలని పిల్లల ఆరోగ్యం బాగుండాలని లంబాడి గిరిజనులు సీత్లా పండుగ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కుకుంటారు. ఈ పండుగలో భగంగా తాండ పొలిమేరల్లో , కూడళ్లలో అమ్మవారి ప్రతిమను ప్రతిష్టిస్తారు, డప్పు వాయిద్యాలతో మేకలు, కొల్లను బలి ఇచ్చి పశువులను వాటిపై నుంచి దాటిస్తారు. మహిళలు బోనాలు చెల్లించి పూజలు చేస్తారు. ఈల దేవతను పూజించే సమయంలో పెద్దమనిషి పూజారిగా వుండి అతని చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు. లంబాడీలు వారి సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగను ప్రతి సంవత్సరం పంటల కాలం ప్రారంభంలో మంగళవారం ఈ పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ కార్యక్రమంలో గిరిజనులందరూ పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.