ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73 వ జయంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గం ఇల్లందకుంట మండలం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73 వ జయంతి కార్యక్రమం మండల కేంద్రంలో ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంగిలే రామారావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా 108 రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకులు దండుగా
అన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతు బాంధవుడు, నీళ్లు ఉండాల్సింది రైతు పంటలకి రైతు కంటికి కాదు అని సాటి చెప్పిన రైతు నేస్తం డాక్టర్ వైయస్ ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపుసారంగపాణి కనుమల్ల సంపత్ శనిగరపు రాము వంగ రామకృష్ణ భోగం సాయి బండి మల్లేష్ సలీమ్ ఓదెలు గోపాల్ రెడ్డి దేవేందర్ గౌడ్ కిరణ్ NSUI@ యూత్ కాంగ్రేస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.