ఘనంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పటేల్ జన్మదిన వేడుకలు

జోగులాంబ గద్వాల, జులై 19  : కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రం, జమ్మిచేడు గ్రామ శివారులో ఉన్న పటేల్ మిల్లులో సీనియర్ నాయకుడు బాచి ఏర్పాటు చేసిన జన్నదిన వేడుకలకు నాయకులు, కార్యకర్తలు, పటేల్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనగా వారి సమక్షంలో ప్రభాకర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివిధ మండలాల నాయకులు కొనియాడారు. అలాగే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన చివరి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలబొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్, ఇసాక్, బాచి, జమాల్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.