గిరిజనులకు తాగునీరు, దళితుల భూములు కబ్జా పైన సిపిఎం ఆధ్వర్యంలో చిట్వేల్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, కందుల వారి పల్లి, గిరిజనులకు, తాగునీరు ఇవ్వాలని, దళితుల భూములను, సెక్రటేరియట్లో ఉద్యోగస్తులు కబ్జా చేసిన, భూమి స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కడప గడప కు వైసీపీ ప్రభుత్వం, దృష్టికి దళితులు గిరిజనుల సమస్యలు రాలేదా అని ప్రశ్నించారు,  కందుల వారి పల్లి గిరిజనులకు గత నాలుగు సంవత్సరాల నుండి త్రాగు నీరులేక, ఇబ్బందులు పడుతుంటే, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలు తమ పొలాలకు పనులకు వస్తేనే నిలుస్తామని బెదిరిస్తున్నారని, తెలిపారు. బోరు మోటారు ఉన్నా విద్యుత్  ట్రాన్స్ఫర్ లేకపోవడంతో నిరుపయోగంగా ఉందన్నారు. ట్రాన్స్ఫారం కు లక్ష రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఈ ప్రభుత్వం దగ్గర లేదా  అని నిలదీశారు. ట్యాంకర్ల ద్వారా అయినా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇదే పంచాయతీలోని బాలాజీ నగర్ లో, దళితవాడలో, దళితులకు పట్టాలు ఇచ్చిన భూములను, సెక్రటేరియట్ లో పనిచేసే అగ్రవర్ణ భూస్వాములు దౌర్జన్యంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని, దళితుల భూములు దళితులకే దక్కాలని వారికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భూకబ్జాలు పాల్పడే బోగస్ ఆన్లైన్ లో చేసే ఎమ్మార్వో లను తొలగించాలని డిమాండ్ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా టిడిపి ప్రభుత్వంలో ఒక ఎకరా భూమి పేదలకు పంచ లేదని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల్లో ఒక ఎకరా భూమి పేదలకు పంచ లేదని  విమర్శించారు.కేరళలో, సిపిఎం పార్టీ, 18 రకాల నిత్యవసర వస్తువులు, సరఫరా చేస్తున్నారు. లక్షలాది మందికి పేదలకు భూమి పంపిణీ చేశారని, ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇచ్చిందని, విద్య వైద్యం పేదలకు అందుబాటులో తెచ్చిందని, కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొని, దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సిపిఎం పార్టీ చిట్వేలు మండల కన్వీనర్ పంది కాళ్ళ మణి మాట్లాడుతూ, వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ నాలుగు వారాలుగా కూలి డబ్బులు యువ లేదన్నారు. జాబ్ కార్డులు ఇవ్వాలని, ఉపాధి కూలీ రోజుకు 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిట్టపల్లి దళితుల స్మశానం ఆక్రమణకు గురైందని, గట్టు మీద పల్లి, వికలాంగుల ఇంటి స్థలాలు కబ్జా గురికాకుండా చూపించాలని డిమాండ్ చేశారు. సిపిఎం మండల నాయకులు ఓ బి లి పెంచలయ్య మాట్లాడుతూ, తిమ్మయ్య గారి పల్లి దళితవాడలో నే శాసనసభ్యులు భూమి పూజ చేసిన చోట సచివాలయం పనులు తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్మశానం దారి అగ్రవర్ణాల కొందరు ఆక్రమిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు విజయ్ కుమార్ నాని, ఓబులవారిపల్లె మండల నాయకులు ఎం జయరామయ్య, కేశవులు, పెనగలూరు మండలం నాయకులు మద్దెల ప్రసాదు, ఆనందయ్య, మల్లారపు గురయ్యా, జెసిబి ఈశ్వరయ్య, భాస్కర్, యేసు రు నరసింహులు, ఎం జయమ్మ, షేక్ బురాన్, మల్లంపల్లి యానాదయ్య, కంభం పార్టీ శివానంద అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.