గద్వాల లో 2 సైబర్ కేసులు నమోదు: ఎస్ఐ ఆనంద్

గద్వాల రూరల్ : గద్వాల మండలం లో చోటు చేసుకున్న రెండు సైబర్ నేరాలపై గద్వాల గ్రామీణ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ఎస్సై ఆనంద్ వివరాల ప్రకారం.. లత్తి పురం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి కి గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు కారు బహుమతి తగిలిందని ఫోన్ చేశారు. అది నమ్మిన హర్షవర్ధన్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తికి ఓటిపి వివరాలు చెప్పడంతో అతడి ఖాతా నుంచి 42 వేల రూపాయలు విడతలవారీగా లూటీ అయ్యాయి. అదేవిధంగా కొండపల్లి గ్రామానికి చెందిన పరశురాముడికి తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డు అప్డేట్ చేస్తామని,పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. అడిగిన వెంటనే స్పందించిన పరశురాముడు ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, నెంబర్ చెప్పడంతో వెంటనే అతడి ఖాతా నుంచి పదివేల రూపాయలు ఖాళీ అయ్యాయి. తాము మోసపోయామని తెలుసుకున్న 24 గంటల్లో టోల్ ఫ్రీ155260 నంబర్ కు సమాచారం ఇవ్వడంతో హర్షవర్ధన్ రెడ్డి ఖాతాలో 10000రూపాయలు ఫ్రిజ్ , పరుశరాముడు ఖాతాలో 10000 రూపాయలు ఫ్రిజ్ చేయడం జరిగిందన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.