క్రీడా ప్రాంగణాలకు త్వరగా స్థలసేకరణ చేయాలి..కలెక్టర్ భవేష్ మిశ్ర

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30 ; క్రీడా ప్రాంగణాల కొరకు స్థలాలను త్వరగతిన గుర్తించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ నందు ఎంపీడీవోలు, తాసిల్దార్ లతో క్రీడా ప్రాంగణాలు, గిరి వికాస్ పథకం, హరితహారం పై మీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో క్రీడా ప్రాంగణాల కొరకు స్థలాలను గుర్తించి ఎంపీడీవో తాసిల్దారులు జాయింట్ రిపోర్టు అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 391 క్రీడా ప్రాంగణాలకు గాను 240 గుర్తించడం జరిగిందని అవి వివిధ దశలలో పనులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మిగిలిన గ్రామాలలో స్థలాలను త్వరగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరి వికాస్ పథకం ద్వారా మొదటిదశలో భాగంగా 33 గ్రామాలలో 150 మంది లబ్ధిదారులకు బోర్, మోటార్, కరెంటు సౌకర్యం కల్పించి వ్యవసాయానికి నీటి సౌకర్యం ఈ పథకం ద్వారా కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు త్వరగా సర్వే పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించడానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. హరితహారం లో భాగంగా ఈ సంవత్సరానికి నిర్దేశించిన 300 కిలోమీటర్ల లక్ష్యాలని అధిగమించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు, సింగిల్ లెఎర్, మల్టీ లేయర్,పద్దతిలో మొక్కలు నాటలన్నారు. పర్యావరణ రక్షణకు అధికారులు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర ,డిఆర్డిఏ పిడి పురుషోత్తం, ఎంపీడీవోలు, తాసిల్దార్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.