కుండపోత వర్షంలో వీఆర్ఏల ఆందోళన ఊరుకొండ తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాలంటూ .వీఆర్ఏల గత రోజులుగా ఆందోళన దిగిన సంగతి తెలిసింది . నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ వీఆర్ఏల తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టారు వర్షంలో తడుస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే కూర్చున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో వీరు ఆందోళన బాట పట్టారు . వీఆర్ఏల సమస్యల పట్ల సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరి నశించాలని. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు .అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ జీవను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే అర్హత కలిగిన వీఆర్ఏలను ప్రమోషన్లు ఇవ్వాలని 55 సంవత్సరాల పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు..

Leave A Reply

Your email address will not be published.