కాకతీయ వైభవ సప్తహం వాయిదా..

జయశంకర్ భూపాలపల్లి, జూలై 11; జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నెల 12 వ తేదీన కోటగుళ్ళు లో నిర్వహించే కాకతీయ వైభవ సప్తహం వేడుకల అన్నింటిని వాయిదా వేస్తున్నట్లు జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారుజిల్లా పరిపాలన యంత్రాంగం అంతా భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక నివారణ చర్యలలో పాల్గొంటున్నందున.. ఈ వేడుకలను వాయిదా వేసినట్టు అయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకుఈ వర్షాల వాళ్ళ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనీ స్పష్టం చేసినందునఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.కళాకారులు, కవులు,ప్రజలు ఇట్టి విషయం ను గమనించి సహకరించగలరనీ కలెక్టర్ విజ్ఞప్తి చేసారు.వర్షాల వాళ్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రెవెన్యూ, పోలీస్, గ్రామ కార్యదర్శులు, విఆర్ఏ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలని, హెడ్ క్వార్టర్ లో అధికారులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అన్నారు . చెరువులు, కాలువలు ఉద్రుతంగా ప్రవహించే ప్రాంతలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరం ఉంటేనే ఇళ్లలో నుండి బయట రావాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తహసీల్దార్లకు ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.