కాకతీయ వైభవ సప్తహంను విజయవంతం చేద్దాం.కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూలై 9 ; కాకతీయుల పరిపాలన సంస్కృతి సాంప్రదాయాలను మరొక్కసారి ప్రపంచానికి తెలియచెప్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహం పేరుతో ఘనంగా ఉత్సవాలు భూపాలపల్లి జిల్లాలోని గణపురం లో గల కోటగుళ్లు వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా నాటి కోటగుళ్లచరిత్రనుతెలియజేయుచున్నం.కాకతీయ కళా వారసత్వం ఉట్టిపడే శిల్పకళా నైపుణ్యం, శైవక్షేత్ర ఖ్యాతి చాటే చరిత్రాత్మక కట్టడం కోటగుళ్లు .ఇవి జయశంకర్ భుపాలపల్లి జిల్లా లో గల గణపురం మండలంలో కలవు.కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు పరిపాలన కాలంలో కాకతీయ సైన్యాధక్షుడు రేచర్ల రుద్రరెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో1234 సంవత్సరంలో ఇది నిర్మించబడిందని ఇక్కడ లభించిన శాసనాల బట్టి తెలుస్తుంది.గణపురం గ్రామానికి ఈశాన్య దిక్కున మట్టికోటలో ఉండటం చేత దేవాలయ సముదాయానికి కోటగుళ్లు అనే పేరు వచ్చింది. అప్పటి ప్రభువులు ఈ దేవాలయాలకు రెండెంచెల సరిహద్దును నిర్మించారు. వెలుపల ప్రాకారం మట్టితో నిర్మించగా, లోపలి ప్రాకారం రాతితో నిర్మించబడింది. నిరుపమాణ తేజానికి, నిక్కచ్చితమైన కళావికాసానికి కాకతీయల చరిత్రకు ఈ ఆలయం అద్దం పడుతోంది. దీర్ఘాకృతి శివలింగ నక్షత్రకారం పానఘట్టంపై కొలువై ఉన్నట్లు కనపడుతోంది..ప్రధాన ఆలయానికి దక్షిణ ప్రాంతంలో సుమారుగా 60 స్తంభాలతో కూడిన మండపం నిర్మితమై ఉంది.. దీన్ని స్తంభాల గుడి అని పిలుస్తారు. వీటిని అనుసంథానం చేస్తూ 22 ఉప దేవాలయాలు కలవుఈ డంగుసున్నం, కరక్కాయ మిశ్రమంతో ఆలయాన్ని నిర్మించినట్లు నిపుణులు చెబుతున్నారు.పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అనేక ఆలయ అపురూప శిల్పాలు బయటపడ్డాయి. తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఆలయ ప్రాకారం, నంది మండపం, రామప్ప నందిని పోలిన ధ్వంసమైన నందీశ్వరుడి అవశేషాలున్నాయి. రామప్ప ఆలయంలో పైభాగంలో అమర్చిన 12 అలాసా శిల్పాలను పోలిన నర్తక శిల్పం అవశేషాలు, రాజనర్తకి మాచల్దేవిదిగా భావించబడుతున్న ఒక అపురూప శిల్పనర్తకి సూర్యభగవానులు విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని మనం ఇప్పుడు ఆలయప్రాంగణంలోచూడవచ్చు.కాకతీయులు కాలం నాటి అపూర్వ వారసత్వ సంపద, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవానికి గత గుర్తుగా ఇది నిలుస్తోందిక్రీస్తుశకం 1323లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి మరణం తర్వాత గణపేశ్వరాలయం పలుమార్లు దాడులకు గురైంది. రామప్ప దేవాలయం కన్నా గణపేశ్వరాలయం శిల్పకళా సందపంలో అత్యంతం వైభోపేతంగా విరాజిల్లుతుంది.మహాశివరాత్రి, కార్తీకమాసంలో గణపేశ్వరం ఆలయాన్ని భక్తులు తండోపతండాలు తరలిస్తారు. సాధారణ సమయంలోను పర్యాటకులను ఆకర్షిస్తుండటంతో ప్రస్తుతం యాత్రీకుల రద్దీ పెరిగింది. వరంగల్‌ జిల్లా కేంద్రానికి గుణపురం మండల కేంద్రంలోని 55 కిలోమీటర్ల దూరంలో ఈ కోటగుళ్లను చేరుకునేందుకు పరకాల మీదుగా గణపురం క్రాస్‌ గాంధీనగర్‌ నుంచి రవాణా సౌకర్యం కోటగుళ్ల వరకు ఉంటుంది. కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే సందర్శకులు హుజురాబాద్‌-పరకాల నుంచి భూపాలపల్లి మీదుగా వచ్చే వారు కూడా గాంధీనగర్‌ మీదుగా చేరుకోవచ్చు. ఖమ్మం, ములుగు ప్రాంతాలకు చెందిన వారు జంగాలపల్లి, వెంకటాపురం, పాలంపేట మీదుగా గణపురం కోటగుళ్లకు చేరుకోవచ్చు.12-7-2022 గణపురం, కోటగుళ్ల వద్ద సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్నాయని ఇట్టి కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారని, కావున కోటగుళ్ళు వద్ద జరిగే కాకతీయ వైభవ సప్తాహ వేడుకలకు ప్రజలు పాల్గొని ఉత్సవాలను తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.