ఏపీఎండీసీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు డిజిగ్నేష్ న్, హోదా కల్పించాలి!  మేనేజ్మెంట్ హామీ నిలబెట్టుకోవాలి! సిఐటియు డిమాండ్

ఏపీఎండీసీ అవుట్ సోర్సింగ్, ట్రైనింగ్ కార్మికులకు, సమాన పనికి సమాన వేతనం, పని హోదా , కల్పించాలని  ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.  అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, మంగంపేటలో విలేకరులతో మాట్లాడుతూ, ఏపీఎండీసీ జేఏసీ కార్మిక సంఘాలు ఐక్య పోరాట ఫలితంగా, ఏపీఎండీసీ మేనేజ్మెంట్, సమాన పనికి సమాన వేతనం, పని హోదా కల్పిస్తామని, కార్మిక సంఘాలతో అగ్రిమెంట్ అయ్యారని,తెలిపారు. మైనింగ్ లో  పనిచేసే కొందరికి మాత్రమే, సమాన పనికి సమాన వేతనం, కల్పించి న్యాయం  చేశారని, మిగతా వారికి, అగ్రిమెంట్ కి భిన్నంగా, వేతనాలు పెంచారు అన్నారు,  డిగ్రీ ఉన్నవారికి ఎం వన్, డిగ్రీ లేనివారికి ఎం టు, అని కార్పొరేషన్లో  లేని హోదా కల్పించారు. దీనివలన కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  డ్రైవర్, మెకానికల్, ఎలక్ట్రిషన్, ఇలాంటి పనులు చేసే వారికి, డిగ్రీ తో ఏమి సంబంధమని ప్రశ్నించారు. గత నెల 16వ తేదీన కార్మిక సంఘం నాయకులు జేఏసీ, ఆధ్వర్యంలో, విజయవాడ హెడ్ ఆఫీస్ లో, ఎండి,  విజి వెంకటరెడ్డి  గారు సమక్షంలో, చర్చలు జరపడం జరిగినదని, అన్యాయం జరిగింది వాస్తవమేనని  అంగీకరించారని,  వేతనాల వ్యత్యాసాన్ని, సరిచేయాలని,  డిజెగైనైజేషన్, పని హోదా, కల్పిస్తామని హామీ ఇచ్చారు, జులై వేతనంలో కలిపి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు, కాలయాపన చేస్తున్నారన్నారు, కింది స్థాయి అధికారులు కనీసం ఫైలు కూడా  ఎండి గారికి పెట్టలేదని, విమర్శించారు. తక్షణం ఎండి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేకుంటే  ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సి ఐ టి యు మండల కన్వీనర్  దార్ల సుధాకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.