ఎస్ఐ, ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : ఎస్పి జె. సురేందర్ రెడ్డి

వచ్చేనెల ఆగస్ట్ 7న నిర్వహించనున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమినరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి గారు అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రిలిమినరీ పరీక్షా నిర్వాహకులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్ నియమ నిబంధనల పాటిస్తూ ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని, ఈ మేరకు చీఫ్ సూపరింటెండేoట్లు మరియు సంబధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.జిల్లా పరిధిలో మొత్తం 5 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1492 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారనీ, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షా నిర్వహణ ఉంటుందని ఎస్పీ సురేందర్ రెడ్డి గారు వెల్లడించారు. అలాగే బాయో మెట్రిక్ హజరుకుగాను, బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లకు తగు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులకుగాను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలనీ, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యరులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా పోలీసు నోడల్ అధికారి, అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు గారు, కో ఆర్డినేటర్ M.S మూర్తి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండేట్లు, బయోమెట్రిక్ ఇన్విజినేటర్లు, ఇన్పెక్టర్లు, పెద్దన్నకుమార్, అజయ్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.