ఉండేడ గ్రామ దళితుల భూమి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముప్పు నిర్వాసితులకు నష్టపరిహారం ఎప్పుడు

 ప్రజా నేత్ర న్యూస్.;పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా గ్రామంలో దాదాపు 15 ఎకరాల భూమి ఉండేడ దళితులు 50 సంవత్సరాల క్రితం నుండి సాగు చేసుకుంటూ పంట వేసుకొని వారు జీవనోపాధి కొనసాగిస్తూ చాలీచాలని బ్రతుకు లు బతుకుతున్నారు వీరు పంట పండించుకుంటున్న భూమి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముప్పునకు గురి అయినది ఈ భూమి పూర్తిగా నీటిలో కలిసిపోయింది ఈ దళితులకు జీవనోపాధారం లేక ఈ గ్రామంలో సరైన కూలి పని కూడా లేక బ్రతకడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ముప్పునకు గురై చాలా సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు మా దళితులపై ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నది ప్రభుత్వం మరియు అధికారులు మేము కూడా ప్రాజెక్టుల నష్టపోయిన ప్రజలమే కదా మరి మా భూములకు ఎందుకు నష్టపరిహారం ఇప్పించలేదు ఇకనైనా ప్రభుత్వం మా దళితులపై కనికరం చూపించి మాకు వేరే చోట భూమి ఇవ్వ మనీ వేడుకుంటున్నారు లేదా నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న భూనిర్వాసిత దళితులు . ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్,.

 

Leave A Reply

Your email address will not be published.