ఈపాస్ యంత్రాలపై డీలర్లకు శిక్షణ.

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30; ఈపాస్ యంత్రాలపై రేషన్ డీలర్లకు శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కే.స్వర్ణలత తెలిపారు. గురువారం సింగరేణి క్లబ్ హౌస్ నందు భూపాలపల్లి జిల్లాలోని 277 సెంటర్ల రేషన్ డీలర్ల అందరికీ ఈ-పాస్ యంత్రాల పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ సరుకుల పంపిణీ లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని విజన్ టెక్ ఈ-పాస్ మిషన్ పై అవగాహన కల్పించారు. అలాగే జిల్లాలోని రేషన్ డీలర్లు అందరూ వానాకాలం సందర్భంగా వరదలు వచ్చినప్పుడు ముప్పు ప్రాంతాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి వీలుగా డీలర్లు రేషన్ అందించుటకు సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిఎం రాఘవేంద్ర, డిటిసిఎస్ అనిల్ ,డిటి రజాక్ ,రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.