ఈజ్ గాం మార్కెట్ లో జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్న డా.పాల్వాయి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ మండలం ఈజ్ గాం మార్కెట్ లో గల జగధాత్రి మందిర్ నుంచి ప్రారంభమైన రథయాత్ర ఈజ్ గాం మార్కెట్ గుండా గణేష్ మందిర్ కు చేరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని జగన్నాథ,సుభద్ర మరియు బలభద్రుని దర్శించుకుని దేవ దేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.భాజపా నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జగన్నాథుని కృప వలన మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ధర్మం నాలుగు పాదాలా నడవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బికాస్ ఘరామి, ఉప సర్పంచ్ సమీర్ గుప్తా, లోనారే రవీందర్, కౌశిక్ భట్టాచార్య మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.