ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరండి. మొక్కిరాల జనార్దన్ రావు.

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 3; భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు గాజ శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి, సభ్యత్వ పరిశీలకులు ముంజ వెంకట్రాజం గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్షణపల్లి విద్యాసాగర్ మరియు భూపాలపల్లి నియోజకవర్గ భాద్యులు మొక్కిరాల జనార్దన్ రావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మొక్కిరాల జనార్దన్ రావు మాట్లాడుతూ 8సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరెస్ భావోద్వేగాలతో, బ్లాక్ మెయిల్ విధానాపు రాజకీయాలతో అధికారమే పరమావధిగా కాలం గడుపుతూ అభివృద్ధిని, భవిష్యత్ నిర్మాణాన్ని విస్మరించారు. ఈనాడు బీజేపీ, టీఆరెస్ పార్టీలు హైదరాబాద్ లో ప్లెక్సీల కోసం తగువాలాడుకునే స్థాయికి దిగజారాయి.ఈ రెండు పార్టీలను గద్దె దించాల్సిన సమయం, వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అన్ని సమస్యలకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారం. అభివృద్ధి ద్వారానే ఆకలి, పేదరికం లాంటి సమస్యలు పోయి, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశాలు వస్తాయి. ఈ తరహా అభివృద్ధి కోసం నిలబడే కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉన్నారు.అలాంటి ఆదర్శ రాజకీయాల కోసం నిలబడే వారికి తెలుగుదేశం పార్టీలో చేరాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా ప్రమాద భీమా, ఆరోగ్య భీమా లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవం, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో చేరాలని, విలువలు గల రాజకీయానికి, ప్రజా సేవకు పునాదులు వేయాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.ఈ కార్యక్రమంలో బొంతల సుధాకర్, లింగాల మహేందర్, రంపిస ప్రశాంత్, లింగాల నవీన్, లింగంపెళ్లి ఆదర్శ్ రావు, బొయిని ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.