అల్లూరి స్ఫూర్తితో పోరాడాలి!  సి ఐ టి యు జిల్లా కార్యదర్శి  సిహెచ్ చంద్రశేఖర్ పిలుపు.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా  ఆదివారం ఉదయం టోల్ గేట్ వద్ద అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.  అల్లూరి సీతారామరాజు కులమతాలకు అతీతంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంకు  వ్యతిరేకంగా పోరాడారు అన్నారు. అల్లూరి అందరివాడు అన్నారు. విప్లవం ద్వారానే స్వాతంత్రం వస్తదని  నమ్మిన మన్యం వీరుడు అన్నారు. అటవీ హక్కుల కోసం,  పోడు భూముల కోసం,గిరిజనులపై అత్యాచారాలు కు,   పన్నులకు వ్యతిరేకంగా  పోరాడారు అన్నారు.  గిరిజనులను చైతన్యవంతుల్ని చేసి, దళాలు ఏర్పాటు చేసి, బ్రిటిష్ వారిని గడగడలాడించాడు అన్నారు. 27 సంవత్సరాలు చిన్న వయసులోనే స్వతంత్రం కోసం పోరాడిన అమరులయ్యారు. 1924 లో బ్రిటిష్ వారు కాల్చి చంపారు. అదేవిధంగా బీజేపీ అనుబంధ ఆర్ ఎస్ ఎస్  సావర్కర్, మాత్రం బ్రిటిష్ వారికి  లొంగి పొయ్యి రాజీ పడ్డారు అన్నారు. అటువంటి వారసత్వం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ, అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు  జరిపే అర్హత లేదన్నారు.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్ని పోరాడి సాధించుకున్న,విశాఖ  ఉక్కు పరిశ్రమ  విదేశీ  బహుళజాతి కంపెనీలకు  అమ్మి, ఐదు వేల మంది, గిరిజనలు దళితులు రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  లక్షమంది ఉపాధి  కోల్పోతారు. వామపక్షాలు అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే, నిర్వీర్యం చేసిన ప్రధాని మోడీ, అటవీ సంపద, గనులు కార్పొరేట్ల కట్టబెట్టారు అన్నారు. రాష్ట్రానికి  బిజెపి తీరని ద్రోహం చేసిందన్నారు. విభజన  చట్టం హామీల కానీ, ప్రత్యేకహోదా గానీ, కడప ఉక్కు గాని, వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల ప్యాకేజీ గానీ, పోలవరం కు, రాజధానికి నిధులు ఇవ్వడం లో గాని, తీరని ద్రోహం చేసింది. రాష్ట్రానికి అడుగుపెట్టే అర్హత లేదన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా,  పోరాడింది కమ్యూనిస్టులే, అందుకే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అసలైన వారసులు కమ్యూనిస్టులే అన్నారు. దేశ సంపదను స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీలకు, ప్రవేట్ పరం చేసి, దేశ ద్రోహానికి పాల్పడుతుందని విమర్శించారు. దేశం కోసం, బ్రిటిష్ సామ్రాజ్య వాదం కోసం వ్యతిరేకంగా పనిచేసిన, అల్లూరి సీతారామరాజు  విగ్రహానికి పూలమాల వేసే అర్హత  బిజెపి వారికి లేదన్నారు. సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్రానికి రావాల్సిన హక్కులకోసం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. మోడీ గో బ్యాక్,  విప్లవం వర్ధిల్లాలి, సీతా రామ్ రాజ్ ఆశయాలను సాధిస్తాం, అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు మోడీ సుబ్బరామయ్య, సిపిఎం పార్టీ మండల నాయకులు, లింగాల యానాదయ్య, సి ఐ టి యు మండల కన్వీనర్, దాసరి  జయచంద్ర, అవాజ్ మండల కన్వీనర్, పి మౌలాలి బాషా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, సిఐటియు నాయకులు,  సి.పుల్లయ్య, కనపర్తి కిరణ్ కుమార్,  ఎం.సుబ్బారాయుడు, అంకయ్య, శంకరయ్య, చంద్ర శేఖర్ రాజు , మద్దెల. ప్రసాద్. కే.చెంగయ్య, ఎం శ్రీనివాసులు, సుదర్శన్, సురేంద్ర. శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.