అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని రైల్వేకోడూరులో  సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా!

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో  అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  సి ఐ టి యు అనుబంధం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం తాసిల్దార్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున  అంగన్వాడీ  టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు,ధర్నా నిర్వహించారు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు,   కోర్కెలు దినోత్సవాల్లో భాగంగా ఈ ఆందోళన నిర్వహించినట్లు చెప్పారు, ముఖ్య అతిథిగా పాల్గొన్న సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంగన్వాడిలకు తక్కువ వేతనాలు ఇచ్చి, వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపించారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రా తమ ప్రభుత్వం వస్తుందని, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని, చెప్పి అమలు చేయకుండా మాట తప్పారన్నారు ,తెలంగాణలో 13600  ఇస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం 11500 ఇస్తున్నారని, 3000  రూపాయలు తక్కువ ఇస్తున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని తెలిపారు, ధరల కనుగుణంగా, కనీస వేతనం 26,000 చెల్లించాలన్నారు. జూలై 1 నుండి, గర్భిణీలకు, పిల్లలకు, మధ్యాహ్న భోజనం, వడ్డించాలని చెప్పారని, ఒక్కొక్కరికి, రూపాయి 80 పైసలతో, ఎలా వడ్డీ ఇస్తారని ప్రశ్నించారు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. 2017 నుంచి టి ఎ డి ఎ లు ఇవ్వలేదన్నారు, స్కూలు ఇంటి అద్దెలు కూడా, నామమాత్రంగా ఇస్తున్నారని, సక్రంగా చెల్లించలేదని, సొంత బిల్డింగులు నిర్మించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈ ఎస్ ఐ, ఏర్పాటు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలన్నారు,  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, గ్రాడ్యుయేట్ చెల్లించాలన్నారు. ఐసిడిఎస్ను  సంస్థాగతం చేసి, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. అందులో భాగం, ఎనిమిది గంటల పని, 12 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు. తక్షణం ఉపసంహరించుకోవాలని  డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అందరికీ వర్తింప చేయాలన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీతాలు పెంచుతామని, చెప్పి మోసం చేస్తున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కన్నా, ఈ ప్రభుత్వంలో, అంగన్వాడీల పై పోలీసుల ద్వారా నిర్బంధాన్ని పెంచడం తీవ్రంగా ఖండించారు.ప్రాజెక్టు కార్యదర్శి  ఎస్ ,శ్రీలక్ష్మి మాట్లాడుతూ. అంగన్వాడీ  సెంటర్లను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడం ఆపాలన్నారు, 400 జనాభా దాటిన మినీ  లను మెయిన్ సెంటర్ గా మార్చాలని, మెయిన్ వర్కర్ తో సమానంగా వేతనం ఇవ్వాలని, కోరారు. ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న హెల్పర్ వర్కర్ పోస్ట్ లను భర్తీ చేయాలన్నారు. గ్యాస్ సిలిండర్,   నెలకు వకటి ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలన్నారు. త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు,  ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐసిడిఎస్ కార్యాలయం నుండి, ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని, తాసిల్దార్ రామ్ మోహన్ గారికి అందించారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు మండల కన్వీనర్ దాసరి జయచంద్ర,  యూనియన్ అధ్యక్షురాలు
ఎన్ . శ్రీరమాదేవి, గౌరవ అధ్యక్షురాలు, జి. పద్మ, సహాయ కార్యదర్శి, టీ రాధాకుమారి, ఉపాధ్యక్షురాలు,  వై.సుజాత, వనజాక్షి, కోశాధికారి,  పి.సుధామణి,  దుర్గ,లీలావతి, శిరీష, వెన్నెల, రమణ కుమారి, శ్రీదేవి, మైథిలి, కుమారి, శోభ, ప్రభావతి, సురేఖ, శ్యామల, రోజా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.