YSR తెలంగాణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

కిషోర్ కుమార్ దొంతమాల(KKD) క్యాంప్ కార్యాలయంలో YSR తెలంగాణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..ఈ నెల 10 నుండి మధిర నియోజకవర్గంలో ప్రారంభం కానున్న షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర…పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన KKD…YSR తెలంగాణ పార్టీ చీఫ్ YS షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 10 నుండి మధిర నియోజకవర్గంలో ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కిషోర్ కుమార్ దొంతమాల(KKD) తెలిపారు.ఈ నెల 9 న వైరా మండలం పాలడుగులో పాదయాత్ర ముగించుకొని 10 వ తేదీన ఉదయం బోనకల్ మండలంలోని రాపల్లి నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.బ్రాహ్మణపల్లి మీదుగా కలకోట చేరుకొని సాయంత్రం గ్రామస్థులతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.అదేవిధంగా 11న సిరిపురం,కృష్ణాపురం,ఆత్కూరు గ్రామాల మీదుగా మధిర చేరుకొని సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు kkd తెలిపారు.అనంతరం మడుపల్లి,బయ్యారం మీదుగా ఈ నెల 12 న బోనకల్ మండలంలోకి అడుగుపెట్టనున్నట్లు పేర్కొన్నారు.తర్వాత చింతకాని, ముదిగొండ మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు.ఈ పాదయాత్రలో గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాదయాత్ర రూట్ మాప్ కన్వీనర్ చంద్రహాస్,జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ మద్దెల ప్రసాద్,మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ మస్తాన్ పాషా,పార్టీ నాయకులు గూడూరు రమణా రెడ్డి,దేవంబట్ల శ్రీనివాస్ శాస్త్రి, ముదిగొండ,చింతకాని,బోనకల్,ఎర్రుపాలెం మండలాధ్యక్షులు సామినేని రవి,వాకా వీరారెడ్డి,జ్ఞానేషు,కోటి రెడ్డి,నియోజకవర్గ అధికార ప్రతినిధి మరియదాసు,మైనార్టీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ ఇస్మాయిల్,యూత్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కార్యకర్తలు సురేష్,బన్నీ,వీరేంద్ర,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.