TV5 రీపోటర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన డా.పాల్వాయి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు టివి – 5 రిపోర్టర్, పాల్వాయి వీరాభిమాని దహాగాం శ్రావణ్ గారు ఈ రోజు సాయంత్రం స్వర్గస్తులైనారు. భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రావణ్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని మీరు గుండె నిబ్బరం చేసుకొని గట్టి ధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో మండల అధ్యక్షులు దామరపల్లి వెంకటేష్, మాజీ సర్పంచ్ దుర్గం తులసిరామ్, మాజీ ఎంపిటిసి ఎల్ములే శంకర్, కరుణాకర్ గౌడ్, బొర్కుట్ రాజేందర్, నూలిగొండ మహేష్, నూలిగొండ రాజశేఖర్, సాయి దనుర్కార్ ఉన్నారు. ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.