సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:14-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్ సిబ్బంది సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం జరిగింది. రక్త దాతలకు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే రక్త దాతలు పునర్జన్మ ఇస్తారన్నారనీ అన్నారు. రక్త దానం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ పౌండేషన్ అధ్యక్షులు సిరాజ్ ఉద్దీన్, ఉపాధ్యక్షులు హైమద్, కార్యదర్శి ప్రదీప్ సేవా ఫౌండేషన్ సభ్యులు తబ్రేజ్ ఖాన్, అయూబ్ ఖాన్, రాజు, రైస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.