వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణి

ప్యాపిలి జున్ 01 (ప్రజా నేత్ర న్యూస్ న్యూస్) : ప్యాపిలి మండలంలోని చిన్నపూజర్ల గ్రామంలోని ఒకటి మరియు రెండవ అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి చేతులమీదుగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని,ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైయస్సార్ బాల సంజీవనికి అదనంగా వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి నిర్వాహకులు చంద్ర కళావతి మరియు లావణ్య లు మాట్లాడుతూ టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తున్నట్లు తెలిపారు.బాలింతలు, గర్భిణీ లు వీటిని తీసుకోవడం ద్వారా వారు అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారన్నారు.గర్భిణీ స్త్రీలు అంగన్‌వాడీ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీస్ అధికారి లక్ష్మి,ఆశా కార్యకర్త ఆదిలక్ష్మి, ఆయాలు రసూల్ భీ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.