వి వి కండ్రిక లో పేదలకు భూములు, స్మశానము, కావాలి! చెరువు కబ్జా అరికట్టాలి!! సిపిఎం నేతలకు ఫిర్యాదు!!

జనం కోసం సిపిఎం, ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా శనివారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం, వి వి కండ్రిక పంచాయతీలో, సమస్యల కోకొల్లలు, అనేకమంది గిరిజనులు దళితులకు సెంటు భూమి లేదని, భూస్వాములు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, వ్యవసాయ కూలి పై ఆధారపడ్డ కూలీలకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న రద్దు చేసిన నారాయణ నాయుడు, 40 ఎకరాల భూములను, దళితులకు గిరిజనులకు పంపిణీ చేయాలని సిపిఎం నేతల దృష్టికి తీసుకొచ్చారు. దళితులకు స్మశానం లేక సొంత భూములు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. గతంలో ఉన్న స్మశాన వాటిక ను భూ కబ్జాదారులు కబ్జా చేశారు. స్మశానం కేటాయించాలని దళితుల డిమాండ్ చేస్తున్నారు. రామస్వామి చెరువుని, అగ్రవర్ణ భూస్వాములు కబ్జా చేసి అక్రమ సాగు చేస్తున్నారన్నారు, కోర్టు కూడా చెరువును స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, భూ కబ్జాదారులు తో కుమ్మక్కై మామూలు తీసుకొని, ప్రతి ఏడాది పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పశువుల మేతకు దారి లేకుండా అడ్డుకుంటున్నారు. ఇది అధికార పార్టీ అండతోనే జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువు స్వాధీనం చేసుకొని నీటి నిల్వకు, పశువుల మేతకు ఏర్పాటు చేయాలన్నారు. చెరువు కబ్జా దారులపై కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఇప్పటికే సిపిఎం అనేక పోరాటాలు చేసింది అన్నారు. అనేకమందికి ఇంటి స్థలాలు రాలేదన్నారు, కొందరికి హౌసింగ్ బిల్లులు పడలేదన్నారు. కొందరికి పట్టాలు ఇచ్చిన పాసుబుక్కులు ఇవ్వలేదన్నారు. కొందరికి విడో పెన్షన్ రాలేదన్నారు. మహిళకు టాయిలెట్లు లేక ఆత్మగౌరవం చంపుకొని, బహిర్భూమి పొలాలకి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో క్లినిక్లు వైద్యము అందక, ముసలివారు కోడూరు కి పోయి రావడం ఇబ్బందిగా ఉంది అన్నారు. జగనన్న పెళ్లి కానుక రద్దు చేశారని, పేదల పెళ్లి చేసుకోవడం భారంగా మారిందని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలు విపరీతంగా పెంచేశారు అని, వచ్చే కూలి, ఏ మాత్రం సరిపోవడం లేదని, మిగులు ఏమాత్రం లేదని, ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరని, ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వి వి కండ్రిక లో సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా అనేక సమస్యలు పరిష్కరించుకో గలిగాము అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం, నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మూడు సంవత్సరాల్లో, ఒక ఎకరా భూమి పేదలకు పంచ లేదన్నారు. ఒక అసైన్మెంట్ పెట్టలేదని, పేదల పైన ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థమవుతుందన్నారు. ఉన్న ప్రభుత్వ భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ వారు భూకబ్జాలు పాల్పడుతున్నారన్నారు. సిపిఎం పరిపాలించే కేరళ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలలో రెండున్నర లక్షల కుటుంబాలకు భూ పంపిణీ జరిగింది అన్నారు, ఒక్క నెల లో 41000 కుటుంబాలకు, భూ పంపిణీ జరిగింది అన్నారు.ఆరు లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టి ఇచ్చిందన్నారు. భూసంస్కరణలు వలనే పేదరికం పోతుందన్నారు. సిపిఎం పార్టీ పేదలకు అండగా ఉంటుందని, పోరాడే పార్టీలో ఎర్ర జెండా కింద భాగస్వాములై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ మండల నాయకులు దాసరి జయచంద్ర, బొజ్జ శివయ్య, డి శివ శంకర్, పి. పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.