విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి – AISF మండల కార్యదర్శి షేక్ సుమేర్ పాష

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ: 22-06-2022;ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని బోథ్ మండల విద్యాధికారి భూమారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా AISF మండల కార్యదర్శి షేక్ సుమేర్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అయిన పది రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేద మద్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యా అందకుండా కుట్రలు చేస్తున్నారని మరో వైపు ప్రవేట్, కార్పొరేట్ పాఠశాలలకు కోమ్ము కాస్తుందని, రాష్ట్రంలో విద్యా శాఖ అధికారుల అండతోనే వారు ఇష్టమైన రీతిలో ఫీజులు వసూళ్లు చేస్తున్న చూసి చూడనట్టు ఉండడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అన్నీ మౌలిక సౌకర్యాలతో పాటు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందించాలని లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా పరిరక్షణకై పోరాటాలు నిర్వహిస్థామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్ షాకీర్,నరేష్ ఏఐఎస్ఎఫ్ సభ్యులు మున్సిఫ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.