విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి – SVA జిల్లా అధ్యక్షులు సుజయ్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:25-06-2022 ; విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్ వి ఏ జిల్లా అధ్యక్షులు సుజయ్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా నేటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేదన్నారు. పెంచిన బస్పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ధోరణితో విద్యార్థుల బస్ పాస్ చార్జీలు పెంచడం భాగమని ఆరోపించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో SVA ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.