వరదల వల్ల ప్రజలకు నష్టం కలుగకుండా ఏర్పాట్లు చేయాలి..

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 28; వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని ప్రగతి భవన్ లో వరద సహాయక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముప్పు ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాల ఏర్పాటు, వాటికి ప్రజలను తరలించడానికి వాహనాలు మౌలిక సౌకర్యాలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించు కోవాలని కలెక్టర్ తెలిపారు. వరదల సమయంలో గర్భిణీ మహిళల ఆరోగ్య పరిరక్షణ, గర్భిణీ మహిళ జాబితాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర చికిత్స నిర్వహణకు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. అంబులెన్సులు ఆర్బీఎస్కే వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. ప్రతి పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మండలాలలో పొంగిపొర్లుతున్న వాగులు, వంక లను ప్రజల దాటకుండా పటిష్ట బారికేడ్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వాగులు చెరువులు తగే అవకాశమున్న ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు తెలిపారు. వరదల సమయంలో ముప్పు గురయ్యే రహదారులలో ప్రజలు రవాణా చేయడానికి అనుమతించొద్దని కలెక్టర్ పోలీసు సిబ్బందికి పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది వరద నీరు ను తోడేందుకు విద్యుత్ మోటార్లు సిద్ధం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులకు కలెక్టర్ ఆదేశించారు. ముప్పుకు గురయ్యే ప్రాంతాలలో పశువులను, గొర్రెలను, మేకలను బయటకు పంపకుండా మండల సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై గోడ పత్రికల సిద్ధం చేయాలన్నారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది లోతట్టు గ్రామాలలో ఎత్తైన స్తంభాలు, ఎత్తైన ప్రదేశాలలో ట్రాన్స్ఫార్మర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి ద్వారా రిస్కు సిబ్బంది, పడవలను సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు. సింగరేణి సంస్థ వద్ద వరదల సమయంలో అత్యవసరంగా వాడు కోవాల్సిన వాహనాల నివేదికను తెప్పించుకోవాలని సూచించారు. జిల్లాలోని డోజర్,ప్రోక్లేన్ , జెసిబి ల వివరాలు వారి యొక్క ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు .వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లిన తెలిసేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు కల్వర్టు, రహదారుల మరమ్మతులు ఉన్నవాటని గుర్తించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. మండల అధికారులు వరదల సమయంలో గ్రామాలలో బస చేసే విధంగా ముందస్తు ఏర్పాట్లు తీసుకోవాలన్నారు. సెల్ సిగ్నల్స్ రాని ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలను ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు .వరదల సమయంలో పంట నష్టపోయిన ప్రాంతాలను వెంటనే వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలపాలని మండల స్పెషల్ ఆఫీసర్లను కలెక్టర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో వరదల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ముప్పు ప్రాంతాలలో వరదల వల్ల తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ ,డి ఆర్ డి ఏ పి డి పురుషోత్తం ,జడ్పీ సీఈఓ శోభారాణి , డి పిఓ ఆశాలత, ఇరిగేషన్ అధికారి జగదీష్, రోడ్లు భవనాల అధికారి వెంకటేష్, విద్యుత్ శాఖ అధికారి బి విక్రమ్ సింగ్, పంచాయతీరాజ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్, డి ఎస్ పి రాములు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.