లక్ష్మీపల్లి పాఠశాలలో.. ఆకట్టుకున్న సంగీతం.. యోగా దినోత్సవ వేడుకలు

ప్రపంచ సంగీత దినోత్సవ , అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మంగళవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. స్వయంగా గాయకురాలు, యోగా శిక్షకులైన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఎస్. కల్పన పర్యవేక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ గాయకురాలు కల్పన ఆలపించిన మధుర గీతాలు అందరిని ఆలరింపజేశాయి.ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే సంగీతం,యోగా సాధనపై ఆసక్తి,అభిరుచిని పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థుల క్రమ శిక్షణమైన జీవితానికి యెగా, సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా యెగా సాధన చేయడం, సంగీతం ను అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని అన్నారు. సంగీతం ,యోగా వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం ఉపాధ్యాయ గాయకురాలు ఎస్.కల్పనను ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ యం. జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, బాసిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.