యోగ తో సంపూర్ణ ఆరోగ్యం. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 21; ప్రతి వ్యక్తి యోగాతో పరిపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. మంగళవారం ఉదయం సింగరేణి క్లబ్ హౌస్ నందు నిర్వహించిన 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యోగా చేసి పరిపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలని ,నిత్యం ఉదయం వ్యాయామం చేస్తూ, యోగా చేస్తూ సుఖంగా జీవించవచ్చని, ఉద్యోగులు నిత్యం టెన్షన్కు గురి అవుతూ ఉన్నవారు, ఉదయం ఇరవై నిమిషాలు యోగాకు కేటాయించినట్లు అయితే ఆరోగ్యంగా ఉండవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం నేను యోగా కొరకు 30 నిమిషాలు కేటాయిస్తానని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగ చేయాలని యోగా వలన ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. భారత దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రతి పట్టణంలో 10 యోగా సెంటర్ లో పెట్టి సాగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ యోగా వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని, ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా చేయడం అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన యోగా వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సేగ్గంవెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ హరిబాబు, జిల్లా అధికారులు యువతీ యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.