మేదర్లు ఎరుకుల  కులస్తుల పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి!  ఇంటింటికి సిపిఎం  లో బాధితుల  ఆవేదన!!

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వెంకటేశ్వరపురం ఎస్ టి  కాలనీల్లో, 150 కుటుంబాలు గాను,   50కుటుంబాలు మేదర్ పనిచేస్తూ  వెదురు బుట్టలు  కులవృత్తి చేసుకొని జీవిస్తున్నారని, జనం కోసం సిపిఎం, ఇంటింటికి సిపిఎం, కార్యక్రమం సందర్భంగా శుక్రవారం, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు  సిహెచ్. చంద్రశేఖర్, లింగాల యానాదయ్య,  దాసరి జయ చంద్ర, కర్ర తోటి హరినారాయణ, తదితర నాయకులు  గ్రామంలో పర్యటించారు. బాధితులు  మాట్లాడుతూ రైతుల దగ్గర పొలంలో వెదురు కొనుగోలు చేసుకునే ఇంటి వద్ద  వెదురు బుట్టలు , గంపలు,అల్లుకుంటూ ఉంటే, ఫారెస్ట్ అధికారులు  విపరీతమైన అటువంటి వేధింపులు దాడులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో  ఫారెస్ట్ భూములు లో సంబంధంలేదని, చెప్పినా వినడం లేదని, వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారని, ఎటువంటి  రసీదులు ఇవ్వడం లేదన్నారు, కొన్ని సందర్భాల్లో, పెనాల్టీలు వేసిన, సరుకు, కత్తులు  స్వాధీనం చేసుకుంటున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు.  పెట్టుబడి పోను, రోజుకు రెండు వందల రూపాయలు, మిగులుతుందని బాధితులు చెప్పారు.వైసీపీ ప్రభుత్వం లో పేదల పైన దాడులు పెరిగాయన్నారు. సిపిఎం జిల్లా నాయకులు  సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గతంలో సొసైటీలో ద్వారా  ప్రభుత్వమే  వెదురు ముడిసరుకు సరఫరా చేసేదని, నేడు ఆ విధానం లేదన్నారు.  తక్షణం ప్రభుత్వమే  వేదురు కలపను సరఫరా చేయాలన్నారు.  మేదర కార్మికులు ఐక్యంగా ఫారెస్ట్ అధికారుల దాడులకు వ్యతిరేకంగా నిలబడాలని, సిపిఎం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  అడవులను నరికి వేస్తున్న, అధికార పార్టీ అండతో అక్రమ  రవాణా చేస్తున్న ఎర్ర చందనం పై ఫారెస్ట్ అధికారులు  దృష్టి పెట్టాలని సూచించారు. అంగన్వాడి స్కూల్ కి సొంత భవనం లేదని, అద్దె భవనం నడుస్తోందని, వారు బాడుగు పెంచండి  లేదా ఖాళీ చేయమని అంటున్నారని, తక్షణం హాస్టల్ వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో అంగన్వాడి సొంత బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. స్కూల్ కి నూనె ప్యాకెట్లు, గుడ్లు, కాంట్రాక్టు సరఫరా చేయలేదన్నారు. అనేకమంది కి ఇంటి స్థలాలు లేవని తెలిపారు,  వృద్ధాప్య,  విడో, ఒంటరి మహిళలకు, పెన్షన్లు అందటం లేదని, సిపిఎం నాయకులు దృష్టికి తీసుకొచ్చారు.  అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగాయని, ఆదాయాలు    పేరగలేదన్నారు. సిపిఎం పరిపాలిస్తున్న కేరళలో , భూ సంస్కరణలు అమలు చేసిందని, భూమిలేని పేదలకు భూమి పంచిదన్నారు 18 రకాల  నిత్యఅవసర వస్తువుల అందిస్తుందని, ధరలను అదుపులో ఉంటుందని, కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొని  నిలబడిందని, కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇస్తుందని, పెట్రోల్, డీజిల్, పైన పన్నెండు రూపాయలు టాక్స్ ని తగ్గించిందని, తెలిపారు. విద్య వైద్యం పేదలకు అందుబాటులో ఉంటుందన్నారు. అందుకే రెండోసారి సిపిఎం పార్టీ కేరళలోఅధికారంలోకి వచ్చింది అన్నారు. పేదలకు అండగా ఎర్ర జెండా సిపిఎం ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ ఆలోచించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.