మంచినీటి సౌకర్యం కల్పించాలి – ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్

ప్రజానేత్ర న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్, తేదీ:25-06-2022 ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన అనంతరం రవీందర్ మాట్లాడుతూ పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారని, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు రోడ్డు దాటి బయటకు వస్తున్నారని దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని అన్నారు. పాఠశాలలో బోర్వెల్ ఉన్నప్పటికీ దానికి మోటార్ బిగించి లేదని అన్నారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.