బియ్యం తూకంలో మోసం.

కృష్ణగిరి..ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం లో మూడు కేజీలు తక్కువ వేస్తూ ప్రజలను మోసం చేస్తు న్నరని బి. బొంతిరాళ్ల గ్రామానికి చెందిన యువకులు భాస్కర్,మహేంద్రలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం అలంకొండ సచివాలయంలో విఆర్ఓ మహేష్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే బియ్యం లో ప్రతి కార్డు దారుని నుంచి డీలర్ మూడు కేజీల బియ్యాన్ని నొక్కేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం నాసిరకంగా, ప్లాస్టిక్ బియ్యంలా ఉన్నాయని అడిగితే… సంబంధిత డీలర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు స్పందించి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్ హుస్సేన్ మియా ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి

Leave A Reply

Your email address will not be published.