బాలసదనాలు చట్ట ప్రకారం నిర్వహించాలి.కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 13: జిల్లాలోని బాలసదనాలు చట్ట ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్ నందు జిల్లాలో నిర్వహించబడుతున్న (3) ప్రైవేట్ బాల సదనాలను కలెక్టర్ తన కార్యాలయంలో సమీక్ష చేశారు. అనాధ పేదపిల్లల కోసం సేవలు అందిస్తున్న బాలసదనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. జిల్లాలో అనాధ బాలల కోసం నిర్వహించబడుతున్న బాలసదనాలలో నిర్వహిస్తున్న సంబంధిత రికార్డులను, బాలలకు కల్పించిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ 3 నెలలకి ఒకసారి జిల్లా స్థాయి తనిఖీ కమిటీ ద్వారా తనిఖీలు నిర్వహించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగాన్ని కలెక్టర్ ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో బాలసదనం నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు కరోనా సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరొక్కసారి 3 బాల సదనాలను తనిఖీ చేసి, సమగ్ర నివేదికను అందించన పిమ్మటనే అట్టి బాలసధనాలకు 5 సంవత్సరాల లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బాలసదనం పరిసరాలను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచాలి కలెక్టర్ అన్నారు. అలాగే అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కే. సామ్యూల్, బాలల సంక్షేమ సమితి చైర్మన్ అనిల్ చందర్ రావు, సభ్యులు రాజేంద్ర ప్రసాద్, డా.సుధాకర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, బాలల సంరక్షణ అధికార్లు రాజకోమురయ్య, మోహినొద్దిన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్, సోషల్ వర్కర్ శైలజ, అవుట్ రీచ్ వర్కర్ లక్ష్మిప్రసన్న, సోషల్ కుమార్, బాలసదనం నిర్వాహకులు సిస్టర్ అన్నా జాన్, కంకల రాజయ్య, డేవిడ్ మార్క్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.