బాధుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలతో టిడిపి ఇంచార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి

కడప జిల్లా పెద్దముడియం మండలం బలపనగూడూరు, నెమ్మలిదిన్న గ్రామంలో జమ్మలమడుగు టిడిపి ఇంచార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి గారు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. , ఆంజనేయ స్వామి, దస్తగిరి స్వామి, వినాయక దేవాలయంలను మరియు దర్శించుకుని పూజ చేసి టెంకాయ కొట్టిన అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, యువకులతో కలిసి వెళ్లి వైస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనిచెప్పి నిరుద్యోగ యువతి,యువకులను, ఉచితబోర్లు అని చెప్పి రైతులను, అమ్మఒడి అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను,200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని చెప్పి బలహీన వర్గాలను, అంతే కాకుండా కనీస మాలిక వసతులైన రోడ్లు, త్రాగునీరు వంటి ముఖ్య అవసరాలను కూడా సమకూర్చకుండ అన్ని వర్గాల ప్రజలను మోసంచేస్తున్న అలాగే ముస్లిం మహిళలకు వివాహ సమయంలో ఇచ్చే దూలహన్ పథకం ను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసినందుకు ఈ అసమర్థ ప్రభుత్వంను గద్దె దించి , తెలుగుదేశం పార్టీ నారాచంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలో తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు కలసి రావాలని పిలుపునిస్తూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కి ఓటు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గా తనను జమ్మలమడగు ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, రాయల్ కిరణ్, బీసీ సెల్ కార్యదర్శి కొండయ్య,యూత్ నాగేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,సుద్దపల్లె బయపురెడ్డి,నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి,వెంకటసుబ్బారెడ్డి, ఆదినారాయణ, థామస్, పకృదిన్, రత్నం, ఎలీసా, దేవదాస్, సహదేవుడు, రవికుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఐజయ్య,మండలతెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, దేవగుడి అభిమానాలు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.