ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు స్థలం పరిశీలించిన అవర్ ఫుడ్ జిల్లా అధికారి కొండగొర్ల కమలాకర్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:11-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో అవర్ ఫుడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ (దాల్ మిల్) స్థలాన్ని అవర్ ఫుడ్ జిల్లా అధికారి కొండగోర్ల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కందులు, శనిగలు, పెసర, మినుములు వంటి పంటలను ఇక్కడే ఆహారశుద్ధి చేసి పప్పు దినుసులుగా మార్చవచ్చు అన్నారు. ఈ గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో పండిన పంటను ముడిసరుకుగా కాకుండా ఆహార శుద్ధి చేసి పప్పుదినుసులుగా చేసి అమ్మడం వల్ల రైతుకు మంచి ధర లభిస్తుందన్నారు. అవర్ ఫుడ్ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న రైతులకు ఎస్బిఐ బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది అన్నారు. అవర్ ఫుడ్ సంస్థ ద్వారానే టెక్నికల్ సపోర్ట్, సర్వీసింగ్, మార్కెటింగ్, రవాణా వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల వారు ముందుకు వస్తే దాల్ మిల్, ఆయిల్ మిల్, పసుపు, కారం, మిల్లెట్స్, రైస్ యూనిట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మన్న, సుదర్శన్, ఉదయ్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.