ప్రైవేటు ఆసుపత్రులను తనకీ చేసిన వైద్యాఅదికారులు..

గద్వాల్: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి Dr. B.చందు నాయక్ గారి ఆదేశం ప్రకారం , PCPND ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. రామచంద్రారెడ్డి మరియు & డీఎమ్ హెచ్ ఓ ఆఫీస్ వైద్య సిబ్బంది గద్వాల్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ , నర్సింగ్ హోమ్స్ మరియు ప్రైవేట్ ల్యాబ్ లను తనిఖీ చేసి బయోమెడికల్ వేస్టేజ్(BMW) మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు(PCB) సర్టిఫికెట్స్ ఉన్నవా లేదా అని తనిఖీ చేశారు మరియు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని తనికి చేశారు,అనంత హాస్పిటల్, నిర్మలా నర్సింగ్ హోం, లలితా మెటర్నిటీ హాస్పిటల్, ఇండియన్ డయాగ్నొస్టిక్ సెంటర్ లను తనిఖీ చేశారు.
అదేవిధంగా ప్రతి ప్రవేట్ హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్, డెంటల్ క్లినిక్ లు, ఫిజియోథెరపీ సెంటర్ లు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్, & డయాగ్నొస్టిక్ సెంటర్స్ తప్పనిసరిగా బయోమెడికల్ రిజిస్ట్రేషన్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేనిచో రిజిస్ట్రేషన్ లేని వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మరియు సీజ్ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరసయ్య పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.