ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

జోగులంబా గద్వాల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.ఏ రాయి అయితేనేమి నెత్తికి కొట్టుకోడానికి అన్న చందంగా ప్రయివేటు పాఠశాలలో అయిన ఇంగ్లీష్ మీడియమే, ప్రభుత్వ పాఠశాలలో అయిన ఇంగ్లీష్ మీడియమే అనుకొని ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్పించి ఆదర్శంగా నిలిచాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గణిత ఉపాధ్యాయుడు జానకి రాముడు ఈ విద్యా సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడంతో తన కుమారుణ్ణి సుంకులమ్మ మెట్టు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరిలో కొందరికి ఆదర్శంగా నిలిచాడు.ప్రయివేట్ పాఠశాలలో చేర్పించి ఫీజుల భాదలకు కూలిచ్చి కొట్టించుకోవడంకంటే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ఉత్తమం అని అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.