ప్రజా సంక్షేమ పాలన సదస్సులో భాగంగా స్వచ భారత్ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బిశ్వేశ్వర్ తుడు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సులో భాగంగా స్వచ భారత్ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బిశ్వేశ్వర్ తుడు గారుకాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ బిజెపి నాయకులతో కలిసి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం మోదీ గారి పాలనలో సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మరియు కేసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలకు వివరించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కాగజ్ నగర్ పట్టణం మున్సిపాలిటీ సంజీవయ్య కాలనీలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు సంజీవయ్య కాలనీలో 30 సంవత్సరాల క్రితం స్థాపించిన పాఠశాల ఈ రోజు కూలిపోయే దశకు చేరుకుందని, విద్యుత్ సరఫరా లేక చిమ్మ చీకటిలో విద్యార్థులు అభ్యసిస్తున్నారని మరియు ప్రజలకు త్రాగు నీరు, డ్రైనేజీలు, రోడ్ల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయిందన్నారు.అనంతరం అంబేడ్కర్ చౌక్ లోని అంబేడ్కర్ గారి విగ్రహానికి కేంద్ర జల శక్తి & గిరిజన సంక్షేమ శాఖమాత్యులు శ్రీ బిశ్వేశ్వర్ తుడు గారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాబురావు గారు మరియు భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు పూలమాల వేసారు.ప్రజా సంక్షేమ పాలన సదస్సు భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్* గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినా సమావేశంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం ఆలాపన చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ పొడుభుములసమస్యలు పరిష్కరించకుండ ఎందరో మంది రైతుల ఆత్మహత్యలకు ఈ తెలంగాణ ప్రభుత్వమే అని ఎద్దేవా చేసారుతెలంగాణలో సాధించిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అన్నారు తెలంగాణ ప్రజలకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకి తెలియజేయాలన్నారుఅనంతరం కేంద్ర జల శక్తి & గిరిజన సంక్షేమ శాఖమాత్యులు శ్రీ బిశ్వేశ్వర్ తుడు గారిని శాలువాతో సన్మానించారు.ప్రతి ఒక్క బిజేపి కార్యకర్త పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు రాబోవు రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్నారుఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీకాంత్, మాజీ మంత్రి వర్యులు అమర్ సింగ్ తిలావత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణ కుమారి, ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సుదర్శన్ గౌడ్, కొట్నాక విజయ్ కుమార్,ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా ఆత్మారామ్ నాయక్,జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల మురళి, కండ్రే విశాల్, రాధిక, మరియు సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, సీనియర్ నాయకులు పాల్వాయి హరీష్ బాబు,BJYM జిల్లా అధ్యక్షులు సుచిత్ మరియు మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.