పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆస్పత్రి కారోన OP బ్లాక్ ముందు యూనియన్ రిమ్స్ అధ్యక్షురాలు G. సంగీత ఆధ్వర్యంలో రిమ్స్ లో పని చేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేసేంట్ కేర్ కార్మికుల 2 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని మరియు యూనిఫామ్స్ షూస్ గ్లూవ్స్ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి కా|| సిర్ర దేవేందర్ గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత 3 రోజుల ముందు పెండింగ్ వేతనాలు తేదీ 09/06/2022 రోజు లోపు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ డైరెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి తేదీ 06/06/2022 రోజు మెమోరాండ్డలు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు సమస్యలు పరిష్కరించలేక పోయారన్నారు ఇప్పటికైనా రిమ్స్ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐన స్పార్క్ ఏజెన్సీ గడువు ఐపోయిన ఎందుకు ఏజెన్సీని కావునసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు వెంటనే గడువు ఐపోయిన స్పార్క్ కాంట్రాక్టర్ ను తొలగించి కొత్త టెండర్ను పిలిచి GO 21 అమలు చేసి పెరిగిన జీతాలు ఇప్పించి కార్మికులను మానసికంగా ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు లేని పక్షంలో తేదీ 12/06/2022 ఆదివారం రోజు వరకు రోజు ఒక గంట నిరసన ధర్నా చేసి తేదీ 13/06/2022 సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ఐనా స్పందించకుంటే సమ్మెకు పొడనికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు కన్నల లక్ష్మీ గారు కమల గారు రుక్మిణి గారు డేవిడ్ గారు k లక్ష్మీ గారు మంగమ్మ గారు O.లసమమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.