పెండింగ్ వేతనాలు చెల్లించాలని – ఏఐటీయూసీ నేత దేవేందర్ డిమాండ్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:06-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో పని చేస్తున్న శానిటేషన్, సెక్యురిటీ గార్డ్స్, పేసేంట్ కేర్ కార్మికుల 2 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ AITUC ఆధ్వర్యంలో రిమ్స్ డైరెక్టర్ డా,, జైసింగ్ రాథోడ్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ నటరాజన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రిమ్స్ గౌరవాధ్యక్షులు సిర్ర దేవేందర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం చేయక పోతే కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.