పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి – PDSU

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:11-06-2022 ; తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో RTC డిపో అసిస్టెంట్ మేనేజర్ గారికి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా PDSU జిల్లా అద్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ హామీకి విరుద్ధంగా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టికెట్ ధరలు భారీగా పెంచడం దారుణమని అన్నారు. ఇది ముమ్మాటికీ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. తెలంగాణ లో పేద, సాధారణ ప్రజలు ప్రయాణించే పేదల వాహనం ఐన ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచడం కెసిఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. చార్జీల పెంపు విద్యార్దులు, పేద ప్రజలు మోయలేని భారం అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU
జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్, సాయికుమార్, అరవింద్, రాకేష్, సురేష్, మహేష్, కార్తిక్, శేకర్, స్వాతి, ఐశ్వర్య, విజయలక్ష్మి,రుచిత, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.